ఒక పక్క భారత్ చైనా సరిహద్దుల పరిస్థితులపై కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్న తరుణంలో భారత్ భూభాగం లోకి అడుగు పెట్టడానికి గానూ చైనా సైనికులు ప్రయత్నాలు చేసారు.  దీనితో వేగంగా స్పంది౦చిన భారత సైనికులు అదే స్థాయిలో స్పందించారు. చైనా అర్మీని తరిమికి కొట్టాయి భారత బలగాలు. గాల్వాన్ వ్యాలీ పెట్రోలింగ్ వద్ద భారీగా బలగాలు మొహరించాయి. 

 

పెట్రోల్ పాయింట్ 14 వద్ద భారత బలగాలు మొహరించాయని అధికారులు  పేర్కొన్నారు. ఇక వాస్తవాధీన రేఖ వద్ద గంట గంటకు పరిస్థితులు వేడెక్కుతున్నాయి. ఇక చైనా బలగాలు భారీగా సరిహద్దుల్లో మోహరించిన నేపధ్యంలో ఎప్పుడు ఎం జరుగుతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక కేంద్ర సర్కార్ కూడా భారీగా బలగాలను పంపింది సరిహద్దులకు.

మరింత సమాచారం తెలుసుకోండి: