ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ సంక్షేమ పథకాల అమలుతో దూసుకెళుతోంది. కరోనా విజృంభణ వల్ల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. తాజాగా మహిళల కోసం జగన్ సర్కార్ వైఎస్సార్‌ కాపు నేస్తంను తీసుకొచ్చింది. అర్హులైన కాపు మహిళలకు ఏటా రూ.15వేల చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 
ఈ నెల 24న ఈ పథకం ప్రారంభం కానుంది. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళల్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44 లక్షల కంటే ఆదాయం తక్కువగా ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. ఈ పథకానికి అర్హత పొందాలంటే పట్టణ ప్రాంతాల్లో వారికి అయితే 750 చదరపు అడుగులకు మించిన ఇల్లు లేదా ఇతర నిర్మాణాలు కలిగి ఉండకూడదు. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాగా ప్రభుత్వం ఈ పథకం కింద రూ.353.81 కోట్లు ఖర్చు చేయనుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: