దేశంలో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో వాటి ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంది. దీనితో తెలంగాణా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే... రాగల రెండు రోజులు (మంగళ, బుధవారాలు) తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి అని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 

 

ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఒక ప్రకటన చేసింది. సోమవారం కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసాయి అని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర ఇంటీరియర్‌, ఒడిసా పరిసర ప్రాంతాల్లో 0.9 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతు౦దని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: