ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనవసరంగా తొందరపడ్డారా...? అంటే అవుననే అంటున్నారు ఏపీ కాంగ్రెస్ నేత సుందర రామ శర్మ. హైకోర్ట్ కోర్టు తీర్పు తర్వాత నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అనవసరంగా హడావుడి చేశారని ఆయన ఆరోపించారు. ఒక టీవీ ఛానల్ లో చర్చా వేదికలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. 

 

హైకోర్ట్ లో తీర్పు అనుకూలంగా వచ్చాక నిమ్మగడ్డ కొంత సంయమనం పాటించాల్సిందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత మాత్రమే ఎస్‌ఈసీది అయితే కరోనాపై ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎందుకు ఎన్నికలు వాయిదా వేశారని ఆయన ఈ సందర్భంగా నిలదీశారు. సుప్రీం కోర్ట్ లో నిమ్మగడ్డ వ్యవహారం నేడు విచారణకు రానున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: