మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. గంటా శ్రీనివాసరావు కి అత్యంత ఆత్మీయ స్నేహితుడు నలంద కిషోర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేడు ఉదయం ఆయనను సిఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

 

ఈ నేపధ్యంలోనే గంటా శ్రీనివాసరావు హుటాహుటిన సిఐడి కార్యాలయానికి చేరుకున్నారు. కిషోర్ ని కలవడానికి గానూ ఆయన వస్తే విచారణ జరుగుతుంది అని అధికారులు అనుమతించలేదు. ఇక ఆయనను కూడా విచారణ తర్వాత అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే అచ్చేన్నాయుడు ని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. గంటా ను కూడా అదుపులోకి తీసుకోవచ్చు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: