కోవిడ్ మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే కొన్ని ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌డంతో పాటు వ్యాక్సిన్‌లు వ‌చ్చాయ‌న్న ప్ర‌క‌ట‌న‌లు కూడా వ‌స్తున్నాయి. తాజాగా ప‌తంజ‌లి ఆయుర్వేద మెడిస‌న్ కూడా క‌రోనాపై పోరాటం విష‌యంలో సక్సెస్ అయిన‌ట్టే తెలుస్తోంది. కోవిడ్ -19 రోగులపై పతంజలి ఆయుర్వేద మెడిసిన్ 'దివ్య కరోనిల్ టాబ్లెట్' క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు వెల్ల‌డి కానున్నాయి.

 

ఈ విష‌యాన్ని పతంజలి యోగ్‌పీత్ (పతంజలి) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) ఆచార్య బాలకృష్ణ చెప్పారు. ఈ ఫలితాలు బాబా రామ్‌దేవ్ స్వ‌యంగా వెల్ల‌డించ‌నున్నారు. కరోనావైరస్ ఆయుర్వేద మెడిసిన్ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు హరిద్వార్ లోని పతంజలి యోగ్పీత్ వద్ద ప్రారంభించబడుతుందని బాలకృష్ణ తెలిపారు. 

 

ఈ ప‌రిశోధ‌న‌ను పతంజలి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (పిఆర్ఐ), హరిద్వార్ మరియు జైపూర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్) సంయుక్తంగా డ‌వ‌ల‌ప్ చేశాయి. అదే స‌మ‌యంలో కరోనిల్‌ను దివ్య ఫార్మసీ, హరిద్వార్ మరియు హరిద్వార్‌లోని పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ అభివృద్ధి చేశాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: