ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రత ఏ మాత్రం కూడా  ఆగడం లేదు. అన్ని దేశాల్లో కేసులు లక్షల్లో నమోదు అవుతున్నాయి. ఇక కరోనా కేసులు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కోటి వరకు వెళ్తున్నాయి. 91 లక్షలు దాటి కరోనా కేసులు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 91,88,362 మందికి కరోనా సోకింది. వీరిలో 4,74,339 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 

 

49,37,282 మంది ప్రపంచ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్నారు. న్యూజెర్సీ, న్యూయార్క్‌ లో కరోనా సెకండ్ వేవ్ మొదలయింది. అమెరికాలో  ఇప్పటి వరకు 23,88,153 మందికి కరోనా సోకింది. వీరిలో 1,22,610 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్ లో కరోనా కేసులు 11 లక్షలు దాటాయి. ఆస్ట్రేలియా లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: