తెలంగాణా సర్కార్ లాక్ డౌన్ కారణంగా ఆర్ధికంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఆర్ధిక ఇబ్బందులను తీవ్రంగా ఎదుర్కొంటుంది తెలంగాణా రాష్ట్ర సర్కార్. ఇప్పుడు గనుక ఆర్ధిక వ్యవస్థ పటిష్ట చర్యలకు సర్కార్ పూనుకోలేదు అంటే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయని పలువురు నిపుణులు అంటున్నారు. హైదరాబాద్ లో  కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి  ఆర్ధికంగా నిలబడటం కష్టమే అంటున్నారు. 

 

ఈ తరుణంలో నేడు కేసీఆర్ ఆర్ధిక శాఖపై సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సమీక్ష చేయనున్న ఆయన... ఉద్యోగులకు పూర్తి వేతనాలపై కూడా నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైతులకు ప్రకటించే కొత్త పథకంతో పాటుగా ఆర్థిక సౌలభ్యంపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. కేంద్రం నుంచి నిధుల జారీ జాప్యంపై అధికారులతో కేసీఆర్ చర్చిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: