ప్రపంచం ప్రగతి పథంలో ముందుకు దూసుకు వెళ్తుంది. టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ది చెందుతుంది. మన దేశంలో ఇతర దేశాలతో పోటీ పడుతూ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంది. అయితే మూడ నమ్మకాలు, మతం, కుల విశ్వాసాల్లో మాత్రం ఒక్క అడుగు వెనక్కి తప్ప ముందుకు పడటం లేదు. గ్రామీణ వాతావరణంలో అదే సాంప్రదాయాలు.. కట్టుబాట్లు, కుల ఆచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ కు మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. కమ్మర్ పల్లి మండలం కొనాపూర్ సర్పంచ్ కుల బహిష్కరణ పై ఆగస్టు 14 లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

 

నిజామాబాద్‌ జిల్లాలోని కొనాపూర్ గ్రామ సర్పంచ్‌  చేసే పనులపై ప్రతిసారి ఏదో ఒక ఫిర్యాదు చేయడం.. అతన్ని మానసికంగా ఇబ్బంది పెట్టడం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో  అయిన తనపై కొందరు గ్రామస్థులు కక్షపూరితంగా వ్యవహరించి కుల బహిష్కరణ చేశారని ఆరోపిస్తూ హెచ్చార్సీలో ఓ పిటిషన్‌ దాఖలైంది.

 

రెండేళ్లుగా తమ కుటుంబానికి నీటి సరఫరాను బంద్‌ చేశారని, తమతో మాట్లాడినవారికి 10 వేల జరిమానా విధిస్తున్నారని ఆ సర్పంచ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ప్రజా ప్రతినిధిగా ఎన్నుకోబడ్డ వ్యక్తికే ఇలాంటి కష్టాలు వస్తుంటాే సామాన్యుల విషయం ఇంక ఎంత తారుణంగా వ్యవహరిస్తారన్న విషయం అవగతం అవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: