అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల వేళ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా అమెరికాలో పనిచేసేందుకు విదేశీ వర్కర్లకు అనుమతి ఇచ్చే హెచ్ 1బీ, ఎల్1 వీసాలపై ఆంక్షలు విధించి బాంబు పేల్చారు. హెచ్‌-1బీ వీసాలను ఈ సంవత్సరం చివరి వరకు నిపివేస్తున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ తాజాగా ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్ విజృంభణ వల్ల అమెరికాలో నిరుద్యోగం రేటు 4.1 నుంచి 13.5 శాతంకు పెరగడంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇతర దేశాల నుంచి వచ్చేవారికి అవకాశాలను నిలిపివేశారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రభావం ఇతర దేశాల కంటే భారత్ పై అధికంగా పడనుంది. అమెరికాలో చాలా మంది భారతీయులు హెచ్1బీ వీసాపై పని చేస్తుండగా 180 రోజుల వరకు ఈ వీసాపై ఉపాధి పొందే అవకాశం ఉంది. కొంతమంది ఈ వీసాలపై వెళ్లి కంపెనీల సహాయంతో గడువు పొడిగించుకుని అక్కడే శాశ్వత నివాసం ఏర్పరచుకుంటున్నారు. ఇలాంటి వారికి అడ్డుకట్ట వేయాలని ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: