వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తనకు ప్రాణహాని ఉందని.. కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ లోక్ సభ స్పీకర్ కు లేఖ రాశారు. ఎంపీ ప్రాణహాని లేఖపై కేంద్రం వెంటనే స్పందించింది. స్పీకర్ కార్యాలయం నుంచి లేఖ అందిన వెంటనే కేంద్ర హోం శాఖ చర్యలు ప్రారంభించింది. ఎంపీ లేఖలో బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొనడంతో ఆ కాల్స్ పై హోం శాఖ ఆరా తీస్తోంది. నిఘా వర్గాల నుంచి హోం శాఖ సమాచారాన్ని సేకరిస్తోంది. 
 
రఘురామకృష్ణంరాజుకు కేంద్ర బలగాల భద్రత కల్పించే అంశాన్ని హోం శాఖ పరిశీలిస్తోంది. ప్రభుత్వ లోపాలను ప్రస్తావించిన రోజు నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రఘురామకృష్ణంరాజు చెబుతున్నారు. వైసీపీ శ్రేణులు, ఇతరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన పేర్కొన్నారు. బెదిరింపులపై ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో లేఖ రాసినట్లు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: