ప్రపంచ దేశాలతో పాటు భారత్ ను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ముస్లింలు అతి పవిత్రంగా భావించే హజ్ యాత్ర ఈ సంవత్సరం ఉండదని కేంద్రం కీలక ప్రకటన చేసింది. సౌదీ అరేబియా ప్రభుత్వ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. దరఖాస్తు రుసుము చెల్లించిన వారికి మొత్తం వాపస్ ఇవ్వనున్నట్లు చెప్పారు. 
 
ఈ ఏడాది హజ్ యాత్ర కోసం 2300 మంది మహిళలు హజ్ యాత్ర కోసం దరఖాస్తు చేసుకున్నారు. కేంద్ర మంత్రి ఈ ఏడాది అనుమతి లభించిన వారు 2021లోను దానిని వినియోగించుకోవచ్చునని తెలిపారు. మొదటి నుంచి హజ్ యాత్రపై సంధిగ్ధత నెలకొనగా సౌదీ ప్రభుత్వమే వద్దని చెప్పడంతో యాత్రను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటన చేసింది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: