జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. . జమ్మూ కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాల ద్వారా ఈ టెర్రరిస్టులు దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందన్నారు ఆయన. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ లోకి మరింత మంది ఉగ్రవాదులను పంపడానికి గానూ పాకిస్తాన్ కుట్ర పన్నుతుందని అన్నారు. భద్రతా దళాలపై దాడులే లక్ష్యంగా వీరు దేశంలోకి చొరబడుతున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. 

 

ముఖ్యంగా నౌషెరీ, రాజౌరీ-పూంచ్, కుప్వరా-కెరన్ సెక్టార్ల ద్వారా అనేకమంది జైషే మహ్మద్, లష్కర్ తాయిబా టెర్రరిస్టులు దేశంలోకి ప్రవేశించనున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే బలగాలకు సమాచారం అందించామని అన్నారు. వారు అందరూ సమన్వయము తో పని చేస్తున్నట్టు వివరించారు. కాగా గత పది రోజులుగా సరిహద్దుల్లో భారీ ఆపరేషన్ లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: