ఈ భేటి తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ మనస్తత్వం బయటపడింది అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. దొరికిన దొంగ వీడియో పై ఆయన ఎందుకు మాట్లాడటం లేదు అని ఆయన ప్రశ్నించారు. తాము ముందు నుంచి నిమ్మగడ్డ వెనుక చంద్రబాబు ఉన్నాడని చెప్తున్నామని... ఇప్పుడు అది నిజమే అయిందని ఆయన అన్నారు. 

 

చంద్రబాబు జీవితం మొత్తం వ్యవస్థలను మ్యానేజ్ చేయడమే అని అంబటి ఆరోపించారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం అనేది చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య అంటూ మాట్లాడారు. ప్రభుత్వంపై టీడీపీ నిమ్మగడ్డ చేసిన కుట్ర బయటపడిందని అన్నారు. రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్నాను అని హోటల్ లో రహస్యంగా కలవడం ఏంటీ అని నిలదీశారు. గంట పాటు జరిగిన చర్చల్లో ఎం కుట్ర జరిగిందో బయట పెట్టాలి అని ఆయన సవాల్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: