గత వారం రోజులుగా సరిహద్దుల్లో పాకిస్తాన్ ఆర్మీ చెలరేగిపోతుంది. భారత బలగాలను లక్ష్యంగా చేసుకుని వరుసగా కాల్పులకు దిగుతుంది. కాల్పుల విరమణ ఒప్పందానికి పదే పదే తూట్లు పొడుస్తుంది పాకిస్తాన్ ఆర్మీ. తాజాగా మరోసారి సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కాల్పులకు దిగింది. జమ్మూ కాశ్మీర్ కుప్వారా జిల్లాలోని మాచల్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంట పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. 

 

దీనికి భారత సైన్యం అదే స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇక పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో భారత జవాన్ లు ముగ్గురు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. ఇక భారత బలగాలు సరిహద్దుల్లో అప్రమత్తం అయ్యాయి. అటు ఉగ్రవాదుల చొరబాట్లు కూడా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: