ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజు కు  కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో కరోనా  వైరస్ కేసులు ఎక్కువగా పెరిగిపోతున్న తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల జూన్ 25 నుంచి సంపూర్ణ లాక్ డౌన్  విధిస్తున్నట్లు కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలకు నిత్య అవసరాల కోసం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన తెలిపారు. 

 

 షాపింగ్ మాల్స్ ప్రార్థన మందిరాలు మద్యం దుకాణాలు.. ఉదయం 11 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది అని తెలిపారు. వైద్య సేవలు మినహా మిగతా అన్ని రకాల రవాణాపై నిషేధం అమల్లో ఉంటుందని తెలిపారు. అయితే కంటోన్మెంట్ గజోన్లలో  ప్రైవేట్ గవర్నమెంట్ ఆఫీసులకు ఆంక్షలు సడలింపు ఇచ్చారు. కంటైన్మెంట్  జోన్లు మినహా అన్ని ప్రాంతాలలో బ్యాంకు యధావిధిగా పనిచేస్తాయని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: