తమకు ప్రతీ రోజు 38,000 పరీక్షలు చేయగల సామర్థ్యం ఉందని... కాని తాము రోజుకు 14,000 పరీక్షలు మాత్రమే చేస్తున్నామని.... ఇది ప్రమాదకరమని నేను భావిస్తున్నా అంటూ మహారాష్ట్ర మాజీ సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. ఇప్పుడు కేసులు ఎక్కువగా కంటైనర్ జోన్ల బయట కనుగొన్నప్పుడు ఎక్కువ పరీక్షలు మాత్రమే పరిష్కారమని అన్నారు.

 

అవసరమైన మేరకు పరిక్షలు చేయడం లేదు అని ఆయన ఆరోపించారు. ముంబై వంటి నగరాల్లో, రోజుకు 4000- 4500 మందిని మాత్రమే పరీక్షిస్తున్నారని ఆరోపించారు. వాటిల్లో 1500 కేసులు బయటకు వస్తున్నాయని రాష్ట్ర సర్కార్ తక్కువ కేసులను చూపించడానికి ప్రయత్నాలు చేస్తుందని ఆయన తీవ్ర  స్థాయిలో మండిపడ్డారు. ఇది కరోనా కట్టడికి పరిష్కారం కాదని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: