ఒక పక్క కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న తరుణంలో సింగపూర్ ప్రధాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిర పరిస్థితుల నేపధ్యంలో సింగపూర్ ప్రధాని లీ హసీన్ లూంగ్ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు గానూ సిద్దమయ్యారు. ‘‘భవిష్యత్ కార్యాచరణ’’ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వ్యాఖ్యానించారు. 

 

ప్రస్తుత పార్లమెంటును రద్దు చేసి, ఎన్నికలకు ఆదేశాలు ఇవ్వాలని ఆ దేశ అధ్యక్షుడు హలీమా యాకోబ్‌కు తాము విజ్ఞప్తి చేసామని పేర్కొన్నారు. కరోనా కారణంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అందుకే దీనికి సంబంధించి తమకు దాదాపు 5 ఏళ్ళ పాటు సమయం కావాలి అని అందుకే ఎన్నికలకు వెళ్తున్నామని అన్నారు. కాగా ఆ దేశంలో కరోనా కేసులు అదుపులోకి వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: