విజయవాడ నగరంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో నిన్న కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఈ నెల 26 నుంచి లాక్ డౌన్ అమలు చేస్తున్నట్టు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం తీసుకున్న కొన్ని గంటల్లోనే ఉత్తర్వులు వెనక్కు తీసుకుంటున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు అన్నీ యథాతథంగానే ఉంటాయని చెప్పారు. 
 
 
మొదట కలెక్టర్ 24, 25 తేదీలలో నిత్యావసర వస్తువులను సమకూర్చుకోవాలని 26 నుంచి పబ్లిక్, ప్రైవేట్ కార్యాలయాలను కూడా మూసివేస్తామని చెప్పారు. కృష్ణా జిల్లాలో నిన్న ఒక్కరోజే 33 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటివరకు 40 మంది మృతి చెందారు. అయితే లాక్ డౌన్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: