కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత రెండు రోజులుగా కరోనాకు మందులు అందుబాటులోకి వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే అందుబాటులోకి వచ్చిన మందులు కరోనాను పూర్తిస్థాయిలో నయం చేస్తాయని చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. గతంలో కనిపెట్టిన మందులనే పేర్లు మార్చి కంపెనీలు అందుబాటులోకి తెస్తున్నాయని చెబుతున్నారు. 
 
కరోనాను పూర్తిస్థాయిలో నయం చేసే మందులు అందుబాటులోకి రాలేదని... ఈ మందుల వల్ల కరోనా ప్రభావం తగ్గించవచ్చని... వ్యాధిని పూర్తిస్థాయిలో నయం చేస్తామని భావించవద్దని అన్నారు. ఇతర దేశాలలో ఈ మందులు కొంతమంది రోగులపై సత్ఫలితాలు ఇచ్చాయని.... అందువల్లే భారత్ ఈ మందులను ఉపయోగించటానికి అనుమతులు ఇచ్చిందని వైద్యులు చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: