కరోనా వైరస్ పుట్టుకకు కారణమైన చైనాలో వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. చైనాలో నిన్న ఒక్కరోజే 12 కొత్త కేసులు నమోదయ్యాయి. మొన్న 22 కేసులు నమోదు కాగా తక్కువగానే కేసులు నమోదవుతున్నప్పటికీ వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో అక్కడి అధికారులు టెన్షన్ పడుతున్నారు. నిన్న నమోదైన కేసులలో 7 కేసులు రాజధాని బీజింగ్ లోనే నమోదయ్యాయి. చైనాలో జూన్ 11 నుండి 250 మందికి పైగా కరోనా నిర్ధారణ అయింది. 
 
కొత్తగా నమోదైన కేసులన్నింటికీ ఒక హోల్ సేల్ ఫుడ్ మార్కెట్ తో లింకులు ఉన్నాయని తెలుస్తోంది. చైనాలో నమోదైన కేసుల్లో ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ముగ్గురు కరోనా భారీన పడినట్టు సమాచారం. చైనాలో భారీగా కేసులు నమోదవుతూ ఉండటంతో కొత్త కేసులు నమోదు కాకుండా అక్కడి అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: