కరోనా వైరస్ నేపధ్యంలో ఇప్పుడు రోగులకు ఆక్సీజన్ కొరత తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఇద్దరు యువకులు ముందుకు వచ్చారు. మహారాష్ట్రలోని ముంబై నగరంలో అదే ప్రాంతానికి చెందిన షానావాజ్ హుస్సేన్, అబ్బాస్ రిజ్వీలిద్దరూ ప్రాణ స్నేహితులు. ఇటీవల ఆక్సీజన్ లేకపోవడంతో వారి సమీప బంధువు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆమె గర్భిణీ. 

 

దీనితో మరొకరు ఆ విధంగా మరనిన్చావద్దు అని భావించి... కరోనా రోగులతో పాటుగా శ్వాసకోస సమస్యలున్న రోగులకు ఉచితంగా ఆక్సీజన్ అందిస్తున్నారు. కారుని విక్రయించి వచ్చిన డబ్బుతో ఈ ఆక్సీజన్ ని కొనుగోలు చేసి అందిస్తున్నారు. ధనికులు పేదలు అనే తేడా లేకుండా వారు అందరికి ఆక్సీజన్ ని ఉచితంగా అందించడం విశేషం. ఒక ఆస్పత్రికి ఏకంగా 300 ఆక్సీజన్ సిలెండర్లు అందుబాటులో ఉంచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: