తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. తెలంగాణలో బుధ, గురు వారాల్లో తేలికపాటి నుంచి  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వాతావరణ పరిస్థితిపై హైదరాబాద్ వాతావరణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. మంగళవారం కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. 

 

ఒడిశా పరిసర ప్రాంతాల్లో 2.1 కి.మీ నుంచి 5.8 కి.మీ ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది వాతావరణ శాఖ. ఆగ్నేయ బంగాళాఖాతంలో 3.1 కి.మీ నుంచి 5.8 కి.మీ ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఇక ఏపీలో కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: