ఈ మధ్య ఈశాన్య రాష్ట్రాల్లో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం లో మూడు రోజుల వ్యవధిలో మూడో భూకంపం సంభవించింది. మొన్న 24 గంటల్లో భూకంపం సంభవించగా ఇప్పుడు మరోసారి సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రతతో భూకంపం ఈ రోజు ఉదయం 08:02 గంటలకు మిజోరంలోని ఛాంపాయ్‌కు చెందిన 31 కిలోమీటర్ల వద్ద సౌత్ నైరుతి (ఎస్‌ఎస్‌డబ్ల్యు) ను తాకిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సిఎస్) వెల్లడించింది. 

 

మొన్న రెండు రోజులు కూడా 5 తీవ్రతతో భూక౦పం వచ్చింది. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ఈ భూకంపాల్లో ఏ విధమైన ఆస్తి ప్రాణ నష్టం లేదని అక్కడి సర్కార్ ప్రకటించింది. ప్రజలు ఎవరూ భయపడవద్దు అని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: