ఉగ్రవాదులు ఉన్నారు అనే పక్కా సమాచారం వస్తే చాలు... జమ్మూ కాశ్మీర్ పోలీసులు భారత బలగాలు వేగంగా స్పందిస్తూ వారికి చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్ లో  పోలీసులు అక్కడి బలగాలు ఉగ్రవాదులకు సహకరించే వారి సమాచారాన్ని అందుకుని రంగం లోకి దిగాయి. ఈ క్రమంలోనే నలుగురిని అదుపులోకి తీసుకున్నాయి. 

 

సోపోర్ పోలీసులు 52 రాష్ట్రీయ రైఫిల్స్ మరియు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) తో కలిసి పోత్కా ముకామ్ & చన్పోరా అథూరాలో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్స్ (కాసో) లను ఏకకాలంలో ప్రారంభించారు. నలుగురు లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాద సంస్థ ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారి సహచరులను పట్టుకున్నారు. దీనిపై తదుపరి దర్యాప్తు జరుగుతుందని... జమ్మూ & కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: