ఈశాన్య రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా తీవ్రతకు తోడు ఇప్పుడు వరదలు కూడా బాగానే ఇబ్బంది పెడుతున్నాయి. తాజాగా అస్సాం లో భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో బ్రహ్మపుత్రా, దిఖౌ, దిశాంగ్, జై భరాలీ, ధనసిరి నదులు ఒంగి పొర్లడంతో 4 జిల్లాల్లో భారీ వరదలు సంభవించాయి. 4 జిల్లాల్లో వరదలు వెల్లువెత్తడంతో 99 గ్రామాలు జలమయం అయ్యాయి. 4 జిల్లాలు వరదనీటితో  ఉండటంతో ఒకరు ప్రాణాలు కోల్పోయి వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు అని అధికారులు వివరించారు. 

 

రాష్ట్రంలోని దీహాజీ, జోర్హాట్, శివసాగర్, దిబ్రూఘడ్ జిల్లాల్లో 4,329 హెక్టార్లలో పంట వరదనీటి లో ఉంది. ఇక సహాయక చర్యలను కూడా రాష్ట్ర సర్కార్ వేగవంతం చేసింది. ధీమాజీ జిల్లాలో 2, శివసాగర్ లో 4, నజీరా జిల్లాలో 3 సహాయపునరావాస కేంద్రాలను వరద బాధితుల కోసం ఏర్పాటు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: