దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపధ్యంలో కరోనా పరీక్షలను కూడా పెంచుతుంది కేంద్రం. రోజు 3 లక్షల పరిక్షలు చేసే ఉద్దేశం తో కేంద్ర సర్కార్ అడుగులు వేస్తుంది. ఇక రాష్ట్రాలు కూడా అదే స్థాయిలో కోరనా పరిక్షల మీద దృష్టి పెట్టాయి. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు లో కరోనా పరిక్షలు ప్రతీ రోజు 20 వేలకు పైగా జరుగుతున్నాయి. 

 

జూన్ 23 వరకు 73,52,911 నమూనాలను పరీక్షించామని ఐసిఎం ఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. గత 24 గంటల్లో 2,15,195 నమూనాలను పరీక్షించారని... ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వివరించింది. దేశంలో అత్యధిక కరోనా పరిక్షలు జరిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత మహారాష్ట్ర.

మరింత సమాచారం తెలుసుకోండి: