తెలంగాణాలో పులి దెబ్బకు ఇప్పుడు ప్రజలు భయపడుతున్నారు. ఎక్కడో ఒక చోట పులి కనపడుతూనే ఉంది ప్రజలకు. తాజాగా మరో పులి ఇప్పుడు కొమరం భీమ్ జిల్లాలో ప్రజలను భయపెడుతుంది. కుమ్రం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలంలో పెద్దపులి స్న్చారిస్తుంది అని అక్కడి స్థానికులు వివరించారు. 

 

కడంబా, బాపునగర్‌ అటవీప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్టు అక్కడి స్థానికులు అటవీ శాఖ అధికారులకు తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని పెద్దపులి ఇక్కడికి వచ్చి ఉండవచ్చు అని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఆ జిల్లాలోని మందమర్రి మండలం శంకర్‌పల్లి పరిసరాల్లో అది ఉందని అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సూచనలు చేసారు. మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి దెబ్బకు సింగరేణి పనులను కూడా అధికారులు ఒక రోజు నిలిపివేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: