మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రజలకు ఇసుక అందుబాటులోకి రావడం లేదని అన్నారు. కేంద్రం ఇచ్చిన బాంబే ఇళ్లను ప్రభుత్వం ఇప్పటికీ అప్పగించలేదని వ్యాఖ్యలు చేశారు. ఆవ భూములపై ప్రభుత్వానికి లేఖ రాసినా ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. ఇసుక విషయంలో ప్రభుత్వానికి ముందుచూపు లేదని చెప్పారు. 
 
జగన్ సర్కార్ అధిక ధరలకు భూములు కొని ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అని చెప్పారు. 15 ఏళ్ల క్రితం ఇళ్లనే ఇప్పటికీ ప్రభుత్వం ఇవ్వలేదని అన్నారు. మద్యపాన నిషేధం విషయంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఉండవల్లి విమర్శలు చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల నాటుసారా వినియోగం పెరిగిందని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: