అసలే కరోనా కారణంగా ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న పారిశ్రామిక రంగానికి ఇప్పుడు వరుస ప్రమాదాలు తల నొప్పిగా మారాయి. చాన్నాళ్ళ తర్వాత ఓపెన్ చేసిన ఫ్యాక్టరీలలో అగ్ని ప్రమాదాలు వరుసగా సంభవించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటన నుంచి మొదలు పెడితే ఇప్పుడు చాలా వరకు కూడా అగ్ని ప్రమాదాలు, ఇతర ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

 

తాజాగా గుజరాత్ లో ఒక ప్రమాదం సంభవించింది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లోని సనంద్ ప్రాంతంలోని జిఐడిసి (గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) లోని కర్మాగారంలో మంటలు చెలరేగాయి. 25 ఫైర్ టెండర్లు అక్కడే మంటలను అదుపు చేస్తున్నాయి. ఈ ఘటనకు సంభందించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భారీ ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: