బిజెపి ఎంపీ సుజనా చౌదరి బిజెపి లో ఉంటూ చంద్రబాబు ఏజెంట్ గా పని చేస్తున్నారు అంటూ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్, సుజనా చౌదరి కామినేని శ్రీనివాస్ కలవడంపై ఆయన విమర్శలు చేసారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని టీడీపీ మ్యానేజ్ చేస్తుంది అని ఆయన ఆరోపించారు.

 

టీడీపీ నేతలు చెప్పినట్టు ఆయన చేస్తున్నారని ఆయనను మార్చడం లో ఏ మాత్రం తప్పు లేదని ఆయన మండిపడ్డారు. అసలు సుజనా చౌదరిని బిజెపిలోకి పంపించింది చంద్రబాబే అంటూ ఆయన విమర్శలు చేసారు. కేసుల భయం తో ఆయన బిజెపి లోకి వెళ్ళాడు అని అన్నారు. వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తుందనే కుట్రలు చేస్తున్నారన్న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: