అక్రమ మద్యం రవాణా కేసులో సీజ్  చేసిన వాహనాలు కు సంబంధించి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పిటిషన్ పై  ఈ రోజు విచారణ జరిపింది ఏపీ హైకోర్టు. ఈ విచారణకు  ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు. అక్రమ మద్యం కేసు విషయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించగా... కొంతమంది ఎస్ హెచ్వో  ల  పనితీరు బాగాలేదని కౌంటర్ దాఖలు చేయాలని ఏజీకి  ఆదేశిస్తే ఏజీపీతో ఫైల్ చేయించారు. 

 

 అయితే అక్రమ మద్యం రవాణా విషయంలో సీజ్ చేసిన వాహనాలు అన్నింటిని మూడు రోజుల్లో ఎస్ హెచ్ వో లు డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ ముందు ప్రవేశపెట్టాలంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. అంతేకాకుండా వాహనదారులు వెంటనే డీఈసీ కి  దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మూడు రోజుల్లోగా  నిర్ణయం తీసుకోవాలంటూ ఆదేశించింది హైకోర్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: