మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్ద రమేష్ కుమార్ నేడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ లో సీఎస్, ఏపీ ఎన్నికల కార్యదర్శి, పంచాయతీరాజ్ కార్యదర్శిలను ప్రతివాదులుగా చేర్చారు. నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. గతంలో ఏపీ హైకోర్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం పునఃనియమించాలని ఆదేశాలు జారీ చేసింది. 
 
కానీ ఏపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. అనంతరం ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ కేసులో హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని సుప్రీంను ఆశ్రయించగా కోర్టు స్టే ఇవ్వలేదు. రాజ్యాంగబద్ధమైన పదవులతో ఆడుకోవద్దని సుప్రీం ఏపీ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. సుప్రీం స్టే ఇవ్వకపోయినా ఏపీ ప్రభుత్వం తనను పదవిలో నియమించకపోవడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: