ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి హైకోర్ట్ కి వెళ్ళారు. గతంలో హైకోర్ట్ ఇచ్చిన తీర్పుని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని తనను బాధ్యతలు చేపట్టనీయడం లేదు అని హైకోర్ట్ లో పిటీషన్ వేసారు నిమ్మగడ్డ. ప్రతివాదులు గా పంచాయితి రాజ్ ప్రధాన కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, సిఎస్ నీలం సహానిని చేర్చారు. 

 

ఆయన పిటీషన్ ని హైకోర్ట్ స్వీకరించింది. తనను బాధ్యతలు చేపట్టే విధంగా తీర్పు ఇవ్వడం లేదని పేర్కొన్న ఆయన... ఏపీ సర్కార్ కోర్ట్ దిక్కరణ కు పాల్పడుతుంది అని పిటీషన్ లో పేర్కొన్నారు. ప్రతివాదిగా ఎన్నికల కార్యదర్శి ని కూడా చేర్చాలని ఆయన కోరారు. మరి దీనిపై ఎప్పుడు విచారణ జరుగుతుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: