ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మరోసారి హైకోర్టు విచారణకు హాజరు అయ్యారు.  అక్రమ మద్యం రవాణా కేసులో సీజ్ చేసిన వాహనాలను యజమానులకు అప్పగించడం జాప్యం జరగడంపై పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఎక్సైజ్ అధికారుల సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటికే రెండు సార్లు హైకోర్టు విచారణకు హాజరైన డీజీపీ... ఈరోజు మూడోసారి హైకోర్టుకు వచ్చారు. అక్రమ మద్యం రవాణా కేసులో సీజ్ చేసిన వాహనాలను యజమానులకు అప్పగించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో నిన్న విచారణ జరిగింది.

 

అయితే న్యాయవాది వాదనలతో సంతృప్తి చెందని న్యాయస్థానం... కోర్టుకు రావాలంటూ డీజీపీని ఆదేశించింది. దీంతో, ఈరోజు ఆయన హైకోర్టుకు వచ్చారు. మూడు రోజుల్లోగా సీజ్ చేసిన వాహనాలను డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ ముందు ప్రవేశపెట్టాలని ఆదేశించింది. దీనిపై సత్వరమే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. కాగా గతంలో ఓ దంపతులు హెబియస్‌కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో ఆయన నేరుగా విచారణకు వచ్చారు.

 

కొన్ని రోజుల క్రితం విశాఖపట్టణంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనకు వెళ్లినప్పుడు పోలీసులు వ్యవహరించిన తీరు పిటిషన్ దాఖలు కావడంతో వివరణ ఇచ్చారు. తాజాగా మూడోసారి కూడా ఆయన స్వయంగా కోర్టుకు రావాల్సి వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: