ముంబై లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. వందల నుంచి వేల కేసులు నమోదు అవుతున్నాయి ముంబైలో. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే అక్కడ కరోనా మాత్రం ఆగడం లేదు. ఇక దాదాపుగా నగరం మొత్తం కూడా కరోనా కేసులు భారీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు అక్కడి సర్కార్ అప్రమత్తం అయింది. 

 

కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో ఆస్పత్రుల సంఖ్యను భారీగా పెంచే ప్రయత్నం చేస్తుంది మహారాష్ట్ర సర్కార్. తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలోని మహాలక్ష్మి రేస్ కోర్సులో బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) సుమారు 1000 పడకల సామర్థ్యం కలిగిన కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: