మహిళను కించ పరిచే వాళ్ళు భయపడే విధంగా కఠిన చర్యలు ఉంటాయని మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. మహిళలపై అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు అభద్రతా భావానికి గురి చేసే విధంగా ఉన్నాయి అని ఆమె పేర్కొన్నారు. మహిళల రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేసారు. 

 

ఇంటర్ డిగ్రీ విద్యార్ధినులకు కౌన్సెలింగ్ అవసరం అని ఆమె పేర్కొన్నారు. అయ్యన్న పాత్రుడు తప్పించుకోవచ్చు గాని శిక్ష మాత్రం కచ్చితంగా పడుతుందని ఆమె స్పష్టం చేసారు. మహిళా ఉద్యోగిని అయ్యన్న పాత్రుడు దూషించిన ఘటన దారుణమని ఆమె ఆరోపించారు. మహిళల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సిఎం స్పష్టం చేసారని ఆమె అన్నారు. మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక దాడులను సిఎం కి వివరించామని ఆమె అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: