పట్టిసీమ మోటార్లు ఆన్ చేయడంతో కృష్ణా నదికి గోదావరి జలాలు వస్తున్నాయి. దీనితో టీడీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా గతంలో సిఎం జగన్ పట్టిసీమ విషయంలో చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శలు చేసారు. పట్టిసీమ వల్ల నీళ్లురావు అది వట్టిసీమ.. మేము దానికి వ్యతిరేకం అని సిఎం జగన్ అన్నారు అని... 

 

దానికి పెట్టే ఖర్చువృధా.. దాన్ని కాన్సిల్ చెయ్యండని ఎన్నికల ముందు మాట్లాడారని... అదే స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమే 2 సంవత్సరాలుగా ప్రభుత్వానికి దిక్కయ్యింది అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు దార్శనికత ముందుచూపు ఎలా ఉంటుందో తెలిసిందా వైఎస్ జగన్ గారూ అంటూ ఆయన ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: