అక్రమంగా మద్యం నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరిని నెల్లూరులో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. వీరి దగ్గర నుంచి భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

 

 

నెల్లూరులో దాదాపు మూడు లక్షల రూపాయల విలువైన మద్యాన్ని స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. నగరంలోని కుక్కలగుంట ప్రాంతంలోని ఓ ఇంట్లో అక్రమంగా మద్యం నిల్వ ఉంచారన్న పక్కా సమాచారంతో అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. స్థానికంగా ఉండే ఓ బార్ అండ్ రెస్టారెంట్​కు చెందిన వ్యక్తులు మద్యాన్ని అక్రమంగా నిల్వ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మద్యాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

 

మద్యం ప్రియులకు ఇటువంటి కేటుగాళ్లు రెట్లు పెంచి జేబు గుల్ల చేస్తున్నారు. ప్రతి రోజు రాష్ట్రంలో ఏదో ఒక చోట ఈలాంటి ఘటనలు చోటు చేసుకున్న.. అక్రమంగా  మద్యం నిల్వ ఉంచి ధరలు పెంచడం మాత్రం మానడం లేదు.. ఆ సమయానికి మందు వెంటనే కావాలి అనీ అధిక ధరలకు మధ్యం విక్రయిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: