ఈశాన్య రాష్ట్రాలు ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా బ్రతుకుతున్నాయి. ఇక అక్కడ వరుసగా భూకంపాలు రావడం తో ప్రజలు అసలు ఇళ్ళ నుంచి బయటకు రావాలి అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇక గత నాలుగు రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో వరుసగా భూకంపాలు వస్తున్నాయి. తాజాగా ఈశాన్య రాష్ట్రం అయిన మిజోరాం లో భూకంపం మరోసారి సంభవించింది. 

 

గురువారం ఉదయం అక్కడ భూకంపం సంభవించింది అని   ప్రకటించారు. మిజోరంలోని దక్షిణ చంఫాయ్ ప్రాంతంలో గురువారం సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదు అయినట్టు వెల్లడించారు. గురువారం తెల్లవారుజామున 1.14 గంటలకు దక్షిణ చంఫాయ్ ప్రాంతంలో 21 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది అని పేర్కొన్నారు. దీనితో ప్రజలు ఇప్పుడు భయపడే పరిస్థితి ఏర్పడింది

మరింత సమాచారం తెలుసుకోండి: