ఏపీలో నైరుతి రుతుపవనాల ప్రభావం కొనసాగుతుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు నేడు రేపు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాయలసీమలో నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కోస్తా, రాయలసీమల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా ఉన్నాయని చెప్తున్నారు.

 

ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని అనుకుని ఉన్న  నైరుతి బంగాళాఖాతం ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం నెలకొంది అని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రానున్న 24 గంటల్లో రాయలసీమలో అనేక చోట్ల, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని  అధికారులు వెల్లడించారు. రేపు రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: