గాంధీలో జూడాలు మరోసారి సమ్మె చేసే అవకాశాలు కనపడుతున్నాయి. తమ డిమాండ్ లకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటేల రాజేంద్ర హామీ ఇచ్చినా  సరే అది ఇంకా అమలు కాకపోవడంతో ఇప్పుడు జూడాలు ఆగ్రహంగా ఉన్నారు. గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై జరిగిన దాడి ఘటనతో తమకు రక్షణ కల్పించాలి అంటూ మూడు రోజుల పాటు ఆస్పత్రి ఎదుట ధర్నా చేసారు. 

 

15 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. కాని ఇప్పుడు అది నెరవేరలేదు అని హామీ ఇచ్చి 10 రోజులు దాటింది అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వారు సమ్మెను భారీగా చెయ్యాలి అని భావిస్తూ నాలుగో తరగతి ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, ఇతర ఔట్‌సోర్సింగ్‌ విభాగాల సిబ్బందిని కూడా కలుపుకుని వెళ్ళే ఆలోచనలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: