రాజస్థాన్ నుంచి వెళ్ళిపోయింది అని భావించిన మిడతల దండు ఇప్పుడు మరోసారి రాజస్థాన్ మీద దాడికి సిద్దమవుతుంది. పాకిస్తాన్ నుంచి మిడతల దండు మరోసారి గాలి వాటం ఆధారంగా ఇటు వైపు వస్తుంది అని అధికారులు గుర్తించారు. అక్కడ ఇప్పుడే కొత్త పంటలు వేసారు అని ఇప్పుడు గనుక మిడతల దండు దాడి చేస్తే మాత్రం ఏమీ మిగిలే అవకాశం ఉండదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. 

 

ఇక ప్రభుత్వం కూడా దీనిపై అప్రమత్తం అయింది. వెంటనే చర్యలకు దిగింది. భారీగా డ్రోన్ లను కూడా రాజస్థాన్ సర్కార్ కి అందించింది. తాజాగా పది డ్రోన్ లను ఇచ్చినట్టు తెలుస్తుంది. రెండు మూడు రోజుల్లో వాటిని తరిమేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: