ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. వైరస్ పేరు వింటే చాలు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతోంది. నిపుణులు కరోనా వైరస్ చిన్నారులు, వృద్ధులపై ఎక్కువ ప్రభావం చూపుతుందని... వీరి విషయంలో మరింత శ్రద్ధ పెట్టాలని చెబుతున్నారు. అయితే తాజాగా ఫ్రాన్స్ లోని ఒక సంస్థ చేసిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
 
ఫ్రాన్స్ కు చెందిన పాశ్చర్ ఇన్స్టిట్యూట్ ఏయే వయసుల వారిపై వైరస్ ఎక్కువ ప్రభావం చూపుతోందనే అంశంపై ఓ సర్వేను నిర్వహించగా చిన్నారులకు కరోనా సోకే అవకాశం తక్కువేనని తేలింది. ప్యారిస్ లో 1340 మందిపై సర్వే నిర్వహించి శాస్త్రవేత్తలు ఫలితాలను వెల్లడించారు. ఈ సర్వేలో తల్లిదండ్రులకు కరోనా సోకినా పిల్లలకు వైరస్ సోకే అవకాశం తక్కువని.... పెద్దల నుంచే వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని వెల్లడైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: