ఈశాన్య రాష్ట్రాలు ఇప్పుడు భూకంపం అనే పేరు వింటే చాలు భయపడుతున్నాయి. అక్కడ ప్రతీ రోజు కూడా ఏదోక రాష్ట్రంలో భూకంపం సంభవిస్తూనే ఉంది. నేడు రెండు రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం లో గత మూడు నాలుగు రోజుల నుంచి తరుచుగా భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా నాగాలాండ్ లో కూడా భూకంపం సంభవించింది. 

 

ఈ రోజు తెల్లవారుజామున 3:03 గంటలకు నాగాలాండ్‌లోని వోఖాకు చెందిన 9 కిలోమీటర్ల తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సిఎస్) వెల్లడించింది. ఈ భూకంపంలో స్వల్ప ఆస్తి నష్టం సంభవించింది అని అక్కడి సర్కార్ వెల్లడించింది. మిజోరాం లో 4 తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికారులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: