దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. తాజాగా ఈ వైరస్ ఎఫెక్ట్ ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్వాంటాస్ ఎయిర్‌వేస్‌పై పడింది. ఆస్ట్రేలియా అధికారులు కరోనా ప్రభావం వల్ల వచ్చే ఏడాది వరకు అంతర్జాతీయ ప్రయాణాలకు అనుమతించే అవకాశం లేదని చెప్పటంతో క్వాంటాస్ ఎయిర్‌వేస్‌ తన ఉద్యోగుల్లో 20 శాతం మందిని తొలగించాలని నిర్ణయం తీసుకుంది. కరోనా విజృంభణ వల్ల 100 విమానాలను 12 నెలల వరకు నడపలేమని అందువల్ల ఉద్యోగులను తొలగిస్తున్నామని కంపెనీ తెలిపింది. 
 
క్వాంటాస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలాన్ జాయిస్ ఈ మేరకు ప్రకటన చేశారు. తమ సంస్థలో ఉన్న 29వేల మంది ఉద్యోగుల్లో 6వేల మందిని తొలగిస్తున్నామని... మరో 15,000 మంది సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు పునరుద్ధరించిన వెంటనే వారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: