ఏపీలో క‌రోనా ప్ర‌జ‌ల‌ను క‌కావిక‌లం చేసేస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 10,331కి ఎగబాకింది. 24 గంటల్లో 36,047 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా స్థానికుల్లో 448 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 37 మందికి, విదేశాల నుంచి వచ్చిన 12 మందికి పాజిటివ్ వ‌చ్చింది. ఇక క‌రోనా పాజిటివ్ కేసులు రికార్డులు బ‌ద్ద‌లు కొడుతుంటే మ‌రో వైపు క‌రోనా మ‌ర‌ణాలు సైతం రికార్డుల‌ను న‌మోదు చేస్తున్నాయి. గ‌త 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 10 మరణాలు సంభవించాయి. 

 

ఈ మ‌ర‌ణాలు కర్నూలులో 4, కృష్ణాలో 3, గుంటూరులో 2, శ్రీకాకుళంలో ఒకటి ఉన్నాయి. రాష్ట్రంలో కరోనాతో ఒకేరోజు 10 మంది చనిపోవడం ఇదే తొలిసారి. వారం నుంచి రోజూ సగటున 5 మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 129కి చేరింది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 43 మంది, కర్నూలులో 42 మంది, గుంటూరులో 14 మంది మృతి చెందారు. ఇక ఇప్పుడు ఇక్క‌డ ఉన్న క‌రోనా జోరు చూస్తుంటే రాష్ట్రాన్ని.. ప్ర‌జ‌ల‌ను దేవుడు మాత్ర‌మే కాపాడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: