ఈ మద్య ఏపిలో రాజకీయాలు ఎంత వాడీ వేడిగా సాగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రతి చిన్న విషయాన్ని బూతద్దంలో చూపిస్తూ అధికార పార్టీపై ప్రతిపక్ష నేలదు ఎగిరిపడుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన ఈఎస్ఐ స్కామ్ లో అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలపై గత వారంలో అరెస్టయిన మాజీ మంత్రి, టీడీపీ నేత కింజారపు అచ్చెన్నాయుడి విషయంలో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పపడుతుందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ నుంచి అర్ధరాత్రి బలవంతపు డిశ్చార్జి హైడ్రామా వరకు ప్రభుత్వ కక్షసాధింపు స్పష్టంగా కనిపిస్తోంది.  

 

 

కాగా, 3 రోజులు ఆసుపత్రి బెడ్ పైనే విచారణకు అనుమతిచ్చిన కోర్టునూ ధిక్కరిస్తారా.. ఇది టీడీపీ నేతలపై ప్రభుత్వ జులుం అన్నారు. 'ఒకటికి రెండు సార్లు శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న వ్యక్తితో ఇలా వ్యవహరిస్తారా? అరెస్ట్ రోజు 14 గంటల పాటు కారులో తిప్పడం నుంచీ అచ్చెన్న విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. ఇలా సీనియర్ ప్రజాప్రతినిధుల  విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన దురదృష్టకరం అని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: