తెలంగాణ సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఆరోవిడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ నర్సాపూర్ లో అదృశ్యమైన అడవులను పునరుద్ధరించుకోవాలని అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటే రాష్ట్రం బాగుంటుందంటూ వ్యాఖ్యలు చేశారు. పచ్చదనం పరిశుభ్రత కేవలం అటవీశాఖ పని మాత్రమే కాదని అన్నారు. రోహిణి కార్తెలోనే నాట్లు వేసే పరిస్థితి వచ్చేలా చూస్తామని చెప్పారు. మొక్కలకు పిల్లల పేర్లు పెట్టాలని చెప్పారు. 
 
సంక్షోభ సమయంలోను తెలంగాణ రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు తప్పనిసరిగా నాటాలని సూచించారు. ప్రజాప్రతినిధులందరూ పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేయాలని చెప్పారు. ప్రజల ఆస్తికి ప్రజలే కాపలాదారుగా ఉండాలని వ్యాఖ్యలు చేశారు. పట్టుబడితే ఏదైనా సాధ్యమవుతుందని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: