గత కొన్ని రోజులుగా భారత్ తో స్నేహ హస్తాన్ని అందిస్తూనే.. కవ్వింపు చర్యలకు పాల్పపడుతుంది చైనా.  కుక్క తోక వంకర అన్నట్లుగా వ్యవహరిస్తుంది చైనా. ఎన్ని ఘర్షణలు జరిగిన బుద్ది మార్చుకోవడం లేదు. ఇటీవల లద్ధాఖ్ లోని గాల్వాన్ లోయలో భారత్-చైనా భద్రతా దళాల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెల్సిందే. ఈ ఘర్షణలో మన సైనికులు 20 మంది అమరులయ్యారు. దాదాపు 43 మంది చైనా జవాన్లు కూడా మరణించినట్టు తెలుస్తోంది. దీంతో రెండు దేశాల సైన్యాధికారులు చర్చలు జరిపి ఓ శాంతి ఒప్పందానికి వచ్చారు.

 

తాజాగా సచిన్ విక్రమ్ మోరే అనే మరో సైనికుడు కూడా వీరమరణం పొందినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.   సచిన్ మోరే గాల్వన్ లోయ ఘర్షణల సమయంలో నదిలో పడిపోయిన ఇద్దరు సహచరులను కాపాడే ప్రయత్నంలో తాను కన్నుమూశాడు. సచిన్ మోరే మరణాన్ని సైన్యం ధ్రువీకరించింది. దాంతో గాల్వన్ లోయ మృతుల సంఖ్య 21కి పెరిగింది. సచిన్ మోరే స్వస్థలం మహారాష్ట్రలోని మాలేగావ్ తాలూకా సాకురి గ్రామం

మరింత సమాచారం తెలుసుకోండి: